ట్రావెలర్స్ కు Dh78 నుండి ప్రయాణ డీల్..!!

- September 13, 2023 , by Maagulf
ట్రావెలర్స్ కు Dh78 నుండి ప్రయాణ డీల్..!!

యూఏఈ: 'స్వయం' యూఏఈ నివాసితులు కువైట్‌కు Dh78 వరకు ప్రయాణ డీల్ ను పొందవచ్చు. అదే సమయంలో  జోర్డాన్‌కు Dh158,  ఇటలీకి Dh318, గ్రీస్‌కి Dh365 లకే డీల్ లను పొందే అవకాశం ఉంది. అయితే, ఫ్లైట్, కార్ హైర్ మరియు హోటల్ మార్కెట్‌ప్లేస్ స్కైస్కానర్ దాని విమాన ధరలు మీరు ప్రయాణించే సమయాన్ని బట్టి ధరల శ్రేణి మారుతూ ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో ఈజిప్ట్, జోర్డాన్, ఇటలీ, గ్రీస్ మరియు టర్కీలతో సహా 15 కంటే ఎక్కువ హాలిడే ఫేవరెట్‌లకు Dh400 కంటే తక్కువ రిటర్న్‌కు డీల్‌లను ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. ట్రావెల్ ఏజెన్సీ యొక్క 'ఎవ్రీవేర్' సెర్చ్ ఆప్షన్‌లో ఈ డీల్ ల వివరాలు తెలిపారు. వన్‌పోల్‌తో కలిసి నిర్వహించిన తాజా పరిశోధనలో 94 శాతం యూఏఈ నివాసితులు ఈ ఆఫర్లను వినియోగించుకుంటున్నారు. అధ్యయనం ప్రకారం, ఈ సంవత్సరం సగటున 14 రోజుల వార్షిక సెలవులు మిగిలి ఉన్నాయి.  ఏజెన్సీ విడుదల చేసిన డేటా ప్రకారం, దాదాపు సగం మంది (42 శాతం) యూఏఈ ప్రయాణికులు ఎక్కడికి పోవాలో నిర్ణయించుకోకుండానే విమానాశ్రయానికి చేరుకున్నారట. అప్పటికప్పుడు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. దాదాపు 60 శాతం మంది తాము బయలుదేరడానికి నాలుగు రోజుల ముందు సెలవును బుక్ చేసుకున్నామని చెప్పారని అధ్యయనం తెలిపింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com