గెస్ట్ రోల్స్‌లో బాలయ్య.?

- September 13, 2023 , by Maagulf
గెస్ట్ రోల్స్‌లో బాలయ్య.?

బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. అందులో ‘భగవంత్ కేసరి’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ సినిమా ఫైనల్ టచెస్ పనుల్లో బాలయ్య బిజీగా వున్నారు.

అలాగే, మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా బాలయ్య ఓకే చేసి పెట్టి వుంచారు. ఈ టైమ్‌లో బాలయ్య ఓ సర్‌ప్రైజింగ్ నిర్ణయం తీసుకున్నారట. యంగ్ హీరోల సినిమాల్లో బాలయ్య కనిపించబోతున్నారన్నదే ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్. 

అవునండీ మీరు విన్నది నిజమే.! త్వరలోనే కొన్ని గెస్ట్ రోల్స్‌తో బాలయ్య సందడి చేయబోతున్నారట. ఇప్పటికే యంగ్ హీరోల్లో బాలయ్య చాలా పాపులర్. ‘జై బాలయ్య’ అనే స్లోగన్‌తో ఈ మధ్య కొన్ని సినిమాల్లో యంగ్ హీరోలు స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇప్పుడు స్లోగనే కాదు, డైరెక్ట్‌గా బాలయ్యనే తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో చూపించబోతున్నారట. సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు ఆ విషయమై హుషారు చూపిస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో. అన్నట్లు బాలయ్య కూడా అందుకు సుముఖంగానే వున్నారని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com