రెండు గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల లైసెన్స్‌లు రద్దు

- September 14, 2023 , by Maagulf
రెండు గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల లైసెన్స్‌లు రద్దు

యూఏఈ: రెండు డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు డొమెస్టిక్ హెల్ప్‌ల నియామకాన్ని నియంత్రించే చట్టాన్ని పాటించడంలో విఫలమైనందుకు తమ లైసెన్స్‌లను కోల్పోయాయి. రెండు ఏజెన్సీలు దుబాయ్‌లోని షమ్మా అల్ మహైరీ డొమెస్టిక్ వర్కర్స్ సర్వీసెస్ సెంటర్, అజ్మాన్‌లోని అల్ బార్క్ డొమెస్టిక్ వర్కర్స్ సర్వీసెస్ సెంటర్. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) “ఈ కార్యాలయాలు … చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. దీని కోసం వారి లైసెన్స్‌లను రద్దు చేయడం, వారి కార్మికుల స్థితిని పరిష్కరించమని వాటి యజమానులను కోరడం జరిగింది. కార్మికులు మరియు గృహ కార్మికుల యజమానుల పట్ల బాధ్యతలు, లైసెన్స్ రద్దు తేదీ వరకు చెల్లించాల్సిన ఏవైనా జరిమానాలు చెల్లించాలి.’’ అని వెల్లడించింది. ఏజెన్సీలపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత స్థానిక అధికారులకు తెలియజేసినట్లు తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన ఏదైనా గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని MoHRE తెలిపింది. గృహ సహాయకుల నియామకంపై ఫెడరల్ చట్టం గతేడాది డిసెంబర్‌లో అమలులోకి వచ్చింది.  డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై ఫీడ్‌బ్యాక్ సమర్పించడానికి తమ కాల్ సెంటర్‌ను 600590000 నంబర్‌కు సంప్రదించాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com