నేడు ఎమిరేట్స్‌కు రానున్న వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి
- September 18, 2023
యూఏఈ: దాదాపు 6నెలలపాటు స్పేష్ స్టేషన్ లో నివసించిన ఎమిరాటీ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి సోమవారం యూఏఈకి తిరిగి రానున్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆరు నెలల పాటు పలు పరిశోధనలు చేసిన తర్వాత ఎమిరెట్స్ వ్యోమగామి అతని క్రూ-6 సహచరులు సెప్టెంబర్ 4న భూమికి తిరిగి వచ్చారు. అప్పటినుంచి వారు హ్యూస్టన్‌లో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. సుల్తాన్ అల్నెయాడికి ఘన స్వాగతం పలికేందుకు యూఏఈ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మరోవైపు అల్నెయాడి రాక కోసం యూఏఈ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో యూఏఈ మొదటి వ్యోమగామి అయిన హజ్జా అల్ మన్సూరి 2019 అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఘన స్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు, అప్పటి అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ అయిన హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!