నేడు ఎమిరేట్స్‌కు రానున్న వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి

- September 18, 2023 , by Maagulf
నేడు ఎమిరేట్స్‌కు రానున్న వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి

యూఏఈ: దాదాపు 6నెలలపాటు స్పేష్ స్టేషన్ లో నివసించిన ఎమిరాటీ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి సోమవారం యూఏఈకి తిరిగి రానున్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆరు నెలల పాటు పలు పరిశోధనలు చేసిన తర్వాత ఎమిరెట్స్ వ్యోమగామి అతని క్రూ-6 సహచరులు సెప్టెంబర్ 4న భూమికి తిరిగి వచ్చారు. అప్పటినుంచి వారు హ్యూస్టన్‌లో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. సుల్తాన్ అల్నెయాడికి ఘన స్వాగతం పలికేందుకు యూఏఈ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మరోవైపు అల్నెయాడి రాక కోసం యూఏఈ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   గతంలో యూఏఈ మొదటి వ్యోమగామి అయిన హజ్జా అల్ మన్సూరి 2019 అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఘన స్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు, అప్పటి అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ అయిన హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com