ఒమన్‌లో క్లౌడ్ సీడింగ్ తో భారీగా పెరిగిన వర్షపాతం..!
- September 18, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో క్లౌడ్ సీడింగ్ క్యాంపెయిన్ 2013-18 మధ్య కాలంలో 15 నుండి 18 శాతం వర్షపాతం పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. వార్షిక వర్షపాతం తక్కువగా ఉండే ఒమన్‌లో వర్షపాతాన్ని పెంచడానికి వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ క్లౌడ్ సీడింగ్ క్యాంపెయిన్ ను చేపట్టింది. నీరు, ఆహార భద్రతను పెంపొందించడానికి.. అదే సమయంలో భూగర్భ జలాల నిల్వలను పెంచడానికి ఇది కీలకమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2013లో మంత్రిత్వ శాఖ తన మొదటి క్లౌడ్ సీడింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి క్లౌడ్ సీడింగ్ విజయం ఒమన్‌లో భూగర్భ జలాల నిల్వలను పెంచిందని తెలిపింది. ప్రస్తుతం సుల్తానేట్‌లో 12 క్లౌడ్ సీడింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. వీటిలో ధోఫర్ గవర్నరేట్‌లోని రెండు స్టేషన్లు , అల్ హజర్ పర్వతాలపై 10 స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ముసండం గవర్నరేట్‌లో కొత్త క్లౌడ్ సీడింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!