‘డెవిల్’ సంయుక్త.! ఈ సారి అంతకు మించి.!
- September 19, 2023
‘విరూపాక్ష’ సినిమాతో సంయుక్తా మీనన్ లక్కీ హీరోయిన్ అయిపోయింది. దాంతో, ఏ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కాలన్నా.. మొదటగా హీరోయిన్ ప్లేస్‌లో సంయుక్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, సంయుక్తా మీనన్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా మాత్రమే ఆఫర్లు టేకప్ చేస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ‘డెవిల్’ సినిమా వున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి.. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి మధ్య జరిగిన రగడ ఇండస్ర్టీలో హాట్ టాపిక్ అయ్యి.. సరికొత్తగా చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాగైనా హిట్టు కొట్టాలనుకుంటున్నాడు. ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టిన కల్యాణ్ రామ్.. మళ్లీ ‘అమిగోస్’తో ఢీలా పడ్డాడు. ‘డెవిల్’తో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.
హీరోయిన్ సంయుక్త వైపు నుంచి నరుక్కొస్తున్నాడట. ‘విరూపాక్ష’ సినిమా సంయుక్త చుట్టూనే తిరుగుతుంటుంది. అలాగే, ‘డెవిల్’ కథలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేశారనీ తెలుస్తోంది. హీరోయిన్‌కి కాస్త ఇంపార్టెన్స్ వుండేలా కథలో కీలక మార్పులు చేశారట. మరి, ఈ మార్పుల మ్యాజిక్ పని చేసి కళ్యాణ్ రామ్‌కి ‘డెవిల్’ కలిసొస్తుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









