యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి ఎర్త్ టూ స్పేస్ జర్నీ
- September 19, 2023
యూఏఈ: యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో ఆరు నెలలు గడిపిన తర్వాత తొలిసారిగా యూఏఈకి తిరిగి వచ్చారు. యూఏఈ నాయకులు, అతని కుటుంబం, క్రౌన్ ప్రిన్స్, మంత్రులు మరియు పౌరులు ఘన స్వాగతం పలికారు. అల్నెయాడితోపాటు హజ్జా అల్ మన్సూరి అంతరిక్ష పరిశోధన మిషన్లలో యూఏఈకి ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇద్దరు వ్యోమగాములుగా గుర్తింపు పొందారు. అల్నెయాడి ISSలో ఉన్న సమయంలో 200 కంటే ఎక్కువ అధునాతన పరిశోధన ప్రయోగాలు మరియు అధ్యయనాలను 585 గంటలపాటు చేశారు.
సెప్టెంబర్ 2018: UAE ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న 4,000 మంది దరఖాస్తుదారుల నుండి హజ్జా అల్ మన్సూరి, సుల్తాన్ అల్నెయాడి ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 2019: మాస్కో యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో అల్నెయాడి, హజ్జా అల్మన్సూరి శిక్షణ ప్రారంభించారు.
జూలై 2022: స్పేస్‌ఎక్స్ క్రూ-6 మిషన్‌లో భాగంగా నాసా చివరి క్రూ లిస్ట్‌లో అల్నెయాడి పేరు చేర్చారు.
ఫిబ్రవరి 2023: నాసా న్యూట్రల్ బ్యూయెన్సీ లాబొరేటరీలో ప్రీ-డిపార్చర్ ISS మిషన్ శిక్షణను పూర్తి చేసారు.
మార్చి 2023: స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి సుల్తాన్ ఆఫ్ స్పేస్ ను విజయవంతంగా ISSకి చేరుకున్నారు.
మార్చి 2023: అతను ISS నుండి తీసిన మొదటి సెల్ఫీని అద్భుతమైన ఎర్త్ వ్యూతో అల్నెయాడి షేర్ చేశారు.
మార్చి 2023: అల్నెయాడి 2,000 మంది పాల్గొన్న కాన్ఫరెన్స్ లో ISS నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
ఏప్రిల్ 2023: అతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెలుపల ఆరున్నర గంటల స్పేస్ వాక్ చేసాడు. అరబ్ వ్యోమగామికి ఇది మొట్టమొదటి అంతరిక్ష నడక.
మే 2023: అతను X (గతంలో Twitter)లో అంతరిక్షం నుండి దుబాయ్ యొక్క అద్భుతమైన నైట్ టైం ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు పామ్ , పరిసరాలు స్పష్టంగా కనిపించాయి.
సెప్టెంబర్ 2023: అల్నెయాడి చారిత్రాత్మక మిషన్ ముగిసింది. తిరిగి భూమికి తిరిగి వచ్చారు.
సెప్టెంబర్ 2023: అతను అల్ ఐన్ అనే ప్రత్యేక విమానంలో అమెరికానుంచి యూఏఈకి తిరిగి వచ్చాడు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు