దుబాయ్ మాల్లో చైనాటౌన్ ప్రారంభం
- September 24, 2023
యూఏఈ: దుబాయ్‌లో ప్రామాణికమైన చైనీస్ సంస్కృతి, సంప్రదాయాలు మరియు రుచికరమైన వంటకాలను అనుభవించాలనుకుంటున్నారా? దుబాయ్ మాల్లోని చైనాటౌన్ శనివారం అధికారికంగా ప్రారంభమైంది. అనేక ఆకర్షణలు, అనుభవాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. షాపింగ్, సాంస్కృతిక అనుభవాన్ని అందించే మాల్.. చైనాటౌన్ ప్రారంభోత్సవంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. సందర్శకులు ఇందులోకి అడుగుపెట్టినప్పుడు వారు చైనా నడిబొడ్డున ఉన్నట్లు ఫీల్ అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ, జియాంగ్సు ప్రావిన్స్ వైస్ గవర్నర్ మా జిన్, దుబాయ్‌లోని చైనా కాన్సుల్ జనరల్ లీ జుహాంగ్, ఎమ్మార్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ అలబ్బర్, ఎమ్మార్ చైర్మన్ జమాల్ బిన్ థానియా వంటి ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. చైనాటౌన్‌లో సందర్శకులు చైనీస్ హస్తకళలు, వస్త్రాలు మరియు కళాఖండాల యొక్క క్యూరేటెడ్ ఎంపికను పొందవచ్చు. ఇక్కడి ఫుడ్ కోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెస్టారెంట్లలో శిక్షణ పొందిన చెఫ్‌లచే తయారు చేయబడిన చైనీస్ వంటకాల విభిన్న మెనూ అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం దుబాయ్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కాన్సులేట్ జనరల్ సహకారంతో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









