నర్సులకు $250,000 అవార్డు.. ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీలకు ఆహ్వానం
- September 26, 2023
యూఏఈ: ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు యొక్క మూడవ ఎడిషన్‌ను ఆస్టర్ DM హెల్త్‌కేర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అర్హులైన నర్సులు అవార్డు కోసం తమ దరఖాస్తులను http://www.asterguardians.comలో సమర్పించాలి. పేషెంట్ కేర్, నర్సింగ్ లీడర్షిప్, నర్సింగ్ ఎడ్యుకేషన్, సోషల్ లేదా కమ్యూనిటీ సర్వీస్ మరియు హెల్త్‌కేర్‌లో పరిశోధన/ఇన్నోవేషన్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలలో దరఖాస్తులు చేయవచ్చు. ప్రముఖ నిపుణులతో కూడిన స్వతంత్ర ప్యానెల్‌తో కూడిన గ్రాండ్ జ్యూరీ టాప్ 10 నర్సులను ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మే 2024లో విజేతలకు అవార్డును అందజేస్తారు.
మే 2022లో దుబాయ్‌లో జరిగిన ఈ అవార్డు మొదటి ఎడిషన్‌లో కెన్యాకు చెందిన నర్సు అన్నా ఖబలే దుబా ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. రెండవ ఎడిషన్‌కు 202 దేశాల నుండి 52,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. యూకేకి చెందిన నర్స్ మార్గరెట్ హెలెన్ షెపర్డ్, మోనోజెనిక్ డయాబెటిస్‌కు సంబంధించిన ప్రముఖ నర్సు మే 12, 2023న విజేతగా ఎంపికైంది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!