ఐఫోన్-15 900 KDకి సేల్.. దుకాణం పై కేసు నమోదు

- September 26, 2023 , by Maagulf
ఐఫోన్-15 900 KDకి సేల్.. దుకాణం పై కేసు నమోదు

కువైట్: కువైట్‌లోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణం తన అధికారిక లాంచ్‌కు ముందు వినియోగదారులకు అధిక ధరకు ఐఫోన్  15ని విక్రయించడానికి చేసిన ప్రయత్నాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య నియంత్రణ విభాగం గుర్తించింది. అధికారుల కథనం ప్రకారం.. దుకాణం ఐఫోన్ 15ను 900 దీనార్ల విలువతో విక్రయిస్తోంది. స్థానిక మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయడానికి ముందు దానిని కొనుగోలు చేయాలనే ప్రజల కోరికను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది. నిజానికి కువైట్ లో ఐఫోన్-15 ధర 460 దినార్లు మాత్రమే. చట్టవిరుద్ధంగా వస్తువుల ధరలను పెంచి అమ్మితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com