కెనడా వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్
- September 27, 2023
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యా ఘటనపై భారత్, కెనడా దేశాలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిజ్జార్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. నిజ్జార్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్‌బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి జైశంకర్ అన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజ్జార్ హత్య కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే ఫైవ్ ఐస్ పార్ట్నర్స్‌తో నిజ్జార్ గురించి ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు ఇటీవల అమెరికా పేర్కొనడంతో ఆ వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఫైవ్ ఐస్‌లో తాము భాగం కాదు అని, ఎఫ్‌బీఐతోనూ తాము భాగస్వాములం కాదు అని అన్నారు. సరైన వ్యక్తిని ఆ ప్రశ్న వేయడంలేదని అన్నారు.
కెనడాలో వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నట్లు మంత్రి జైశంకర్ ఆరోపించారు. రాజకీయ కారణాల కోసం ఆ నేరాల్ని కెనడా భరిస్తున్న తీరును కూడా ఆయన ఖండించారు. నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు