అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దు: సౌదీ
- October 08, 2023
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ శనివారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో టెలిఫోన్ కాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గాజా, దాని పరిసరాలలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. దాడుల తీవ్రతను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వారు అభిప్రాయబడ్డారు. ఏ రూపంలోనైనా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సౌదీ వ్యతిరేకమన్నారు. ఇరువురు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలని విదేశాంగ మంత్రి సూచించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు, మరింత హింసను నివారించడానికి సంఘటితంగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఇదే విషయమై సౌదీ విదేశాంగ మంత్రికి శనివారం యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెప్ బోరెల్ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ క్రమంలో సౌదీ విదేశాంగ మంత్రి.. ఈజిప్టు, ఖతార్ మరియు జోర్డాన్‌ల విదేశాంక మంత్రులతో మాట్లాడారు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..