ద్వంద్వ పౌరసత్వ హక్కులపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- October 10, 2023
న్యూఢిల్లీ: రాజ్యాంగ పండితుడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పబ్లిక్ లా చైర్ తరుణబ్ ఖైతాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన భారత సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మరొక పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడాన్ని పిటిషన్ లో ఆయన సవాలు చేశారు. అలాంటి నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన పిటిషన్‌లో ప్రొఫెసర్ ఖైతాన్ ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం సెక్షన్ 9(1), సెక్షన్ 4(1), సెక్షన్ 4(1A)కి రెండవ నిబంధన, 1955లోని సెక్షన్‌లను సవాలు చేశారు. "పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, భారత రాజ్యాంగ ధర్మాల విలువలకు విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. పౌరసత్వం దానంతట అదిగా కోల్పోవడం అనేది భారతదేశాన్ని అత్యంత నిర్బంధిత దేశాలలో వర్గీకరిస్తుంది. ’’ అని సెంచరీస్ మాగ్జిమ్ ఇంటర్నేషనల్ ఇండియా ఆఫీసులో సీనియర్ భాగస్వామి డాక్టర్ సైఫ్ మహమూద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిసి సేన్ న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!