బహ్రెయిన్‌లోకి డ్రగ్స్ తరలింపు.. వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- October 10, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోకి 500 ట్రామాడాల్ క్యాప్సూల్స్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు నలభై ఏళ్ల వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. బహ్రెయిన్ కస్టమ్ అధికారుల కథనం ప్రకారం..అనుమానితుడు తన ఆసియా దేశం నుండి బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతని దుస్తులలో డ్రగ్ క్యాప్సూల్స్ ను దాచాడు. యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. విచారణలో, నిందితుడు బహ్రెయిన్‌కు అక్రమంగా రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో అక్రమ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు అంగీకరించాడు. అతని లోదుస్తులలో 500 కంటే ఎక్కువ ట్రామడాల్ క్యాప్సూల్స్ ను గుర్తించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అక్రమ రవాణా ఉద్దేశంతో ట్రామాడోల్, మెథాంఫెటమైన్, గంజాయి మరియు డయాజెపామ్‌లను దిగుమతి చేసుకున్నట్లు మరియు కలిగి ఉన్నట్లు అభియోగాలు మోపింది. అలాగే చట్టపరమైన అనుమతి లేకుండా వ్యక్తిగత ఉపయోగం కోసం గంజాయి, డయాజెపామ్‌లను కలిగి ఉన్నాడని నిరూపించింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!