తక్షణ సహాయం కోసం శ్రీలంక అభ్యర్థన
- May 24, 2016
దుబాయ్‌లోని శ్రీలంక కాన్సులేట్ జనరల్, వలసదారులు మరియు ఇతర యూఏఈ నివాసితులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల సంభవించిన వరదలతో తల్లడిల్లుతున్న శ్రీలంకను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక కోరుతోంది. 103,776 కుటుంబాలు, 425,601 మంది ప్రజలు శ్రీలంకలో సంభవించిన వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల కారణంగా 68 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని శ్రీలంకకు చెందినవారే కాకుండా ఇతరులూ తమను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాన్సులేట్ జనరల్ వద్ద డొనేషన్లను ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోబడతాయనీ, శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డొనేషన్ల స్వీకరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు పలువురు శ్రీలంక జాతీయులతోపాటు, యూఏఈలోని ఇతర దేశస్తులూ ముందుకు వస్తారని శ్రీలంక ఆశిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









