యూఏఈలో CBSE ప్రాంతీయ కార్యాలయం.. స్వాగతించిన విద్యావేత్తలు
- November 06, 2023
యూఏఈ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రాంతీయ కార్యాలయాన్ని యూఏఈలో ఏర్పాటు చేయాలనే ఇండియా నిర్ణయించడంపై యూఏఈలోని సిబిఎస్‌ఇ పాఠశాల టీచర్లు సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం విద్యార్థులు, ఉపాధ్యాయులకు సత్వర పరిష్కారాలను అందిస్తుందన్నారు. దుబాయ్‌లోని సిబిఎస్‌ఇ కార్యాలయాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మూడు రోజుల యూఏఈ పర్యటన సందర్భంగా ప్రకటించారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన సమావేశంలో యూఏఈలోని సిబిఎస్‌ఇ పాఠశాలల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. సిబిఎస్‌ఇ ప్రణాళికాబద్ధమైన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం భారతీయ మిషన్లతో కలిసి పనిచేస్తుందని ప్రధాన్ పేర్కొన్నారు. యూఏఈలోని సాధారణ విద్యా పాఠశాలల్లో భారతీయ సంతతికి చెందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 271,109గా ఉంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 248, ప్రైవేట్ పాఠశాలల్లో 270,861 మంది చదువుతున్నారు. విద్యార్థులు భారతదేశం వెలుపల బోర్డు మరియు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!