ఇళ్లలో నగలు, నగదు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
- November 06, 2023
బహ్రెయిన్: రెండు ఇళ్లలో బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలించిన ఆరోపణలపై 34 ఏళ్ల వ్యక్తిని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల నుంచి వ్యక్తి ఈ విలువైన వస్తువులు, నగదును దొంగిలించినట్లు అనుమానిస్తున్నట్లు సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. చోరీలపై సమాచారం అందిన వెంటనే బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇరువురి ఇళ్లను తనిఖీ చేసి నిందితుడిని గుర్తించి తదుపరి అరెస్టుకు దారితీసిన కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించబడిన వస్తువులను లా ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుంది. నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ఫార్వార్డ్ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!