గాజా పై అణుబాంబు వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ మంత్రిపై చర్యలు

- November 06, 2023 , by Maagulf
గాజా పై అణుబాంబు వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ మంత్రిపై చర్యలు

యూఏఈ: గాజాపై అణుబాంబు వేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ సమావేశాల నుండి సస్పెండ్ చేసినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులపై తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని నెట్‌నాయహు పాలక కూటమిలోని అల్ట్రానేషనలిస్ట్ రాజకీయ నాయకుడు హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు ఇజ్రాయెల్ కోల్ బరామా అన్నారు. ఈ క్రమంలో అందరినీ ఒకేసారి చంపడానికి గాజా స్ట్రిప్‌పై అణు బాంబు వేయాలని భావిస్తున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ మంత్రి అణుబాంబు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించంది. ఇజ్రాయెల్-హమస్ దాడుల్లో ఇప్పటివరకు 1,400 మంది ఇజ్రాయెల్ పౌరులు, 9,488 మంది పాలస్తీయన్లు చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com