వంతెన పై నుంచి రైల్వే ట్రాక్ పై పడిన బస్సు..నలుగురు దుర్మరణం
- November 06, 2023
జైపూర్: రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ దారుణం జరిగింది. అయితే ప్రమాద సమయంలో ఆ ట్రాక్‌పై ఏ రైలూ రాకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లయింది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!