యూఏఈ సాయుధ బలగాల స్పెషల్ పరేడ్
- November 07, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో సాయుధ దళాలు తమ అధునాతన రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఆదివారం యూఏఈ సైనిక శక్తిని తెలియజేశారు. భూమి, సముద్రం మరియు వైమానిక దళాలు అనేక అత్యంత సవాలుగా ఉండే పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే మాక్ పోరాట పటిమను ప్రదర్శించారు. అబుదాబి మీడియా ఆఫీస్ షేర్ చేసిన వీడియోలో సైనిక సిబ్బంది విమానం నుండి సముద్రంలోకి దూకడం నుండి 'శత్రువు' లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించడం వంటి ఆకట్టుకునే విన్యాసాలను నిర్వహించారు. అబయాలు ధరించిన మహిళ సైనిక సిబ్బంది కూడా ప్రత్యేక సైనిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు ప్రదర్శించిన అధునాతన సామర్థ్యాలను ప్రెసిడెంట్ ప్రశంసించారు. సాయుధ దళాలు దశాబ్దాలుగా యూఏఈ అభివృద్ధి ప్రయాణాన్ని విశ్వసనీయంగా కాపాడుతున్నాయని కొనియాడారు. యూనియన్ ఫోర్ట్రెస్ 9 సైనిక కవాతులో వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఛైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!