ఏపీలో NATS ఉచిత నేత్ర, కాన్సర్ వైద్య, మరియు రక్త దాన శిబిరాలు
- December 26, 2023
అమరావతి: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా జెట్టివారిపల్లిలో నాట్స్ ఉచిత నేత్ర, కాన్సర్ వైద్య, రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసింది. నాట్స్ ప్రోగ్రామ్స్ ఉపాధ్యక్షుడు హరినాథ్ బుంగటావుల అమ్మ చెంచమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటైన ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 450 మంది అర్హులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. జెట్టివారిపల్లి గ్రామంలో అర్హులందరికీ మామోగ్రఫీ, ప్యాప్ స్మియర్, ఓరల్ పరీక్షలు, బి. ఎం. ఐ., ఛాతి ఎక్సరే, ర్యాన్దం బ్లడ్ షుగర్, బీపీ, కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. 126 మందికి కంటి అద్దాలు, 44 మందికి క్యాటరాక్టు సర్జరీస్ సూచించారు. ఇదంతా గౌతమి నేత్రాలయము, నాట్స్ సహకారంతో ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలకు వచ్చిన వారందరికీ ఉచిత మందులు పంపిణి చేయడంతో పాటు సుమారు 500 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి నాట్స్ తన సేవా భావాన్ని చాటింది.
జెట్టివారిపల్లి గ్రామంలో జనార్దన్ కస్తూరి, లోకేష్ కట్టా, ఇప్పటికే 102 సార్లు రక్తదానం చేసి రికార్డుకి ఎక్కిన చిట్వేలికి చెందిన డాక్టర్ వేణుగోపాల్‌తో పాటు శ్రీధర్ అప్పసాని, సురేష్ బొందుగుల, గౌతమి నేత్రాలయానికి చెందిన డాక్టర్ వాడ్రేవు రాజు, గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ నిర్వహకులు చిన్నబాబు సుంకవల్లి, విజయశ్రీ రక్తనిధి కేంద్రం, నల్లేపల్లి హరికృష్ణ , దేవయ్య బుంగటావుల, పాపయ్య మాచిన, విశ్వేశ్వర బుంగటావుల, చందు తుంగ, హరనాథ్ నాయునిపాటి, నాట్స్ ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. చిట్వేలి ఉన్నత పాఠశాల ఎన్ సి సి కమాండెంట్ పసుపుల రాజశేఖర్ నేతృత్వంలో ఎన్ సి సి క్యాడేట్లు వాలంటరీ సేవలను అందించారు.
హరినాథ్ బుంగటావుల చక్కటి సమన్వయంతో వ్యవహరించడంతో ఈ ఉచిత నేత్ర, కాన్సర్ వైద్య, రక్త దాన శిబిరాలను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించి స్థానికుల ప్రశంసలు పొందింది. అర్హులందరికీ నాట్స్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని స్థానికులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, మండల టిడిపి నాయుకులు కట్టా గుండయ్య, నాగరిపడు సర్పంచ్ కస్తూరి రవీంద్ర, భాస్కర్ బుంగటావుల, నియోజకవర్గ టిడిపి నాయకురాలు దుద్యాల అనిత దీప్తి, న్యావాది మరియు టిడిపి లీగల్ సెల్ నాయకుడు కె. జె. పి. రెడ్డయ్య, న్యావాది న్యాయని బాలాజీ, రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహులు, పొల్లోపల్లి మాజీ ఎంపీటీసీ శివ, ఓబులవారిపల్లె మాజీ ఎంపీపీ వెంకటేశ్వర రాజు, మాజీ జడ్పీటీసీ నాయుడు రమణయ్య, డాక్టర్ చంద్రశేఖర్, జనసేన చిట్వేల్ మండలం అధ్యక్షులు మాదాసు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ప్రోగ్రామ్స్ ఉపాధ్యక్షులు హరినాథ్ బుంగటావుల చేసిన కృషిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రశంసించారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదాన్ని చేతల్లో చూపించిన హరినాథ్ బుంగటావులను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అభినందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!