తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు సహజ సిద్ధమైన చిట్కా.!
- January 03, 2024
తెల్ల జుట్టు సమస్య తీవ్రతరమైంది. ఒకప్పుడు వయసుతో పాటు తెల్లజుట్టు సమస్య వచ్చేది. అందుకే దాన్ని సమస్యగా తీసుకునేవారు కాదు. కానీ, ఇప్పుడది పెద్ద సమస్యగా పరిణమించింది. అందుకు కారణం చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోవడం.
మనం తీసుకునే ఆహారమే అందుకు కారణం. టీనేజ్ యువతనీ ఈ సమస్య వేధిస్తోంది. దాంతో, సడెన్‌గా పార్టీలకూ, ఫంక్షన్లకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో మార్కెట్లో లభించే డై ప్రొడక్టులను వాడాల్సి వస్తోంది. దాంతో, ఈ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. అలాగే, ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడాల్సి వస్తోంది.
అందుకే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాల ద్వారా ఈ సమస్యను తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ఉసిరి పొడి కాగా, ఇంకోటి బ్లాక్ టీ.
బ్లాక్ టీ పౌడర్ని నీటిలో కాచి చల్లారాక తలకు పట్టించి ఓ అరగంట తర్వాత మంచి నీటితో కడిగేస్తే తెల్లజుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, ఏ టీ పౌడర్ అయినా తీసుకుని దాన్ని ఓ గ్లాస్ వాటర్‌లో కలిపి బాగా మరిగించి, గోరింటాకు పొడిని, ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత కడిగేసినా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే, ఈ ప్రాసెస్‌కి కాస్త ఓపిక కావాలి. మెల్ల మెల్లగా జుట్టు నల్లగా మారుతుంది. కానీ, జుట్టు ఆరోగ్యంగా వుంటుంది.
తాజా వార్తలు
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!









