ఓ సోషియో ఫాంటసీ చిత్రం 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా'
- June 01, 2016స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్ లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునే సమయంలో భారీ డిజాస్టర్ ఎదురుకావటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎక్స్ పరిమెంటల్ జానర్ లోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. హేబా పటేల్, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.
తాజాగా టైటిల్ తో పాటు నిఖిల్ లుక్ ను రివీల్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది