'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో త్రిష..
- June 01, 2016
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం అమితాసక్తి చూపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వందల్లో హర్రర్ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే కోలీవుడ్‌లోనూ బోల్డెన్ని హర్రర్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటివరకు గ్లామర్ పాత్రలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న త్రిష ఈసారి భయపెట్టేందుకు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'నాయకి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటే, మాదేష్ దర్శకత్వంలో 'మోహిని' అనే మరో హర్రర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించుకునే ఈచిత్రానికి 'హారీ పొట్టర్' విఎఫెక్స్ టీమ్ పనిచేయనుంది. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ హర్రర్ చిత్రాన్ని యుకె, థారులాండ్, మెక్సికో దేశాల్లో చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







