ప్రశాంత్ వర్మకి హనుమంతుడు దొరికేశాడా.?
- February 15, 2024‘హనుమాన్’ సినిమాతో వచ్చిన హిట్టుకి.. తదుపరి పార్ట్ ‘జై హనుమాన్’పై ఆటోమెటిగ్గా అంచనాలు పెరిగిపోయాయ్. ఆ అంచనాల్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ రోజు రోజుకూ మరింత పెంచేస్తున్నాడు.
ఈ సినిమాలో ఓ స్టార్ హీరో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు.. అన్న అనౌన్స్మెంట్తోనే సినిమాపై అంచనాలు ఆకాశానికంటేలా చేశాడు ప్రశాంత్ వర్మ.
ఇక అక్కడితో మొదలైన ‘జై హనుమాన్’ హైక్ అంతకంతకూ పెరిగిపోతూ వస్తోంది. మొదటి ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కాదు కాదు రానా అన్నారు.
ఇప్పుడు కన్నడ స్టార్ హీరో, ‘కేజీఎఫ్’తో ప్యాన్ ఇండియా గుర్తింపున్న హీరో యష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి ‘హనుమాన్’ కోసమే ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని అడిగాడట. ఆయన నో అనేసరికి ఆ పాత్రను గ్రాఫిక్స్‌తో కానిచ్చేశాడు.
కానీ, ‘జై హనుమాన్’లో హనుమాన్ పాత్రే అత్యంత కీలకం. సో, ఆ పాత్ర చుట్టూనే అంచనాలు తిరుగుతున్నాయ్. యష్ పేరు బయటికి రాగానే రెస్పాన్స్ పాజిటివ్‌గా అందుతోంది. అయితే, ఇది కూడా కేవలం ప్రచారం మాత్రమే. అధికారికంగా ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ అనౌన్స్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్