ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హరోం హర’.!
- February 15, 2024
కంటెంట్ వున్న కథల్ని నమ్ముకుంటూ.. సరికొత్త పంథాలో హీరోయిజం చూపిస్తున్న నటుడు సుధీర్ బాబు. తొలి సినిమా నుంచీ అదే పంథాలో పయనిస్తున్నాడు సుధీర్ బాబు. అయితే, ఈ మధ్య సుధీర్ బాబు ప్రయోగాలు కాస్త బెడిసికొడుతున్నాయనుకోండి.
తాజాగా ‘హరోం హర’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించాడు సుధీర్ బాబు. తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లిరిక్స్‌ని బట్టి.. ఇదో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందబోతోందనీ అర్ధమవుతోంది.
చెడుతో చేసే యుద్ధంలా కనిపిస్తోంది. రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయ్ కథనంలో. సుధీర్ బాబు ఎప్పటిలాగే ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. జ్ఞాన్‌సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
పరమ శివుడిని రిప్రజెంట్ చేస్తూ.. ఓ సాధారణ వ్యక్తిలాగే హీరో కనిపిస్తున్నాడీ సినిమాలో. అయితే, అసలు కథేంటీ.? సుధీర్ బాబు ఎవరి కష్టాలు తీర్చడానికి వస్తున్నాడు. అందుకోసం ఆయన చేయబోయే సాహసాలేంటీ.? తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







