ప్రబాస్తో ఆ దర్శకుడు తీయబోయే సినిమా ఏంటో తెలుసా.?
- April 10, 2024‘సలార్’ తర్వాత ప్రబాస్ సమాంతరంగా చాలా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. అందులో ఒకటి హను రాఘవపూడి సినిమా కూడా వుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు కానీ, కన్ఫామ్ అయిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి.
ఈ సినిమా గురించి తాజాగా హను రాఘవపూడి కొన్ని విషయాలు వెల్లడించాడు తాజాగా ఓ ఈవెంట్ సందర్భంగా. అవేంటయ్యా అంటే, ఈ మూవీని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించాలనుకుంటున్నాడట హను.
‘ఫౌజీ’ అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది. ఈ సినిమాలోనూ తన గత సినిమా (సీతారామం) హీరోయిన్ మృణాల్ ఠాకూర్నే ఫిక్స్ చేశాడట హను రాఘవపూడి. ‘ఫౌజీ’ అనే టైటిల్ని బట్టి.. ఈ సినిమాలో ప్రబాస్ని ఓ సైనికుడిగా చూపించబోతున్నాడనీ తెలుస్తోంది.
అందమైన లొకేషన్లలో అద్బుతమైన దృశ్య కావ్యంలా ఈ సినిమాని రూపొందించబోతున్నాడట. ఈ వివరాలన్నీ స్వయంగా హను రాఘవపూడినే వెల్లడించడం విశేషం. అయితే, అసలు కథ, కమామిషు ఎలా వుండబోతోందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు