‘కన్నప్ప’లో స్వీటీ.? నిజమేనా.?
- April 13, 2024మంచు ఫ్యామిలీ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మంచు ఫ్యామిలీ తరపున ఓ సంచలనాత్మక చిత్రం.. అందులోనూ ప్యాన్ ఇండియా చిత్రం వుండాలన్న కసితో సీనియర్ నటుడు పెద్దాయన మోహన్ బాబు ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో సౌత్, నార్త్ నుంచి పలు భాషా ప్రముఖ నటీనటుల్ని భాగం చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ తదితరులు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తమిళ పరిశ్రమ నుంచి మోహన్ లాల్.. ఇలా పలువురు నటీనటుల్ని భాగం చేశారు.
తెలుగులో ప్రబాస్, నాగార్జున, ఎన్టీయార్ తదితర స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయ్. లేటెస్ట్గా స్వీటీ అనుష్క పేరు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
ప్రబాస్ పక్కన జోడీగా మొదట నయనతారను అనుకున్నారు ఈ సినిమా కోసం. ప్రబాస్ పోషించబోయే శివుడి పాత్రకు కాంబినేషన్‌గా పార్వతిగా నయన తార కనిపించబోతోందని అన్నారు. కానీ, ఆ పాత్రలో అనుష్క పేరు వచ్చి చేరింది. అంటే, పార్వతిగా అనుష్క కనిపించబోతోందన్నది ఈ ప్రచారం తాలూకు సారాంశం. ఒకవేళ అదే నిజమైతే, ఈ కాంబినేషన్ హిట్టు కాంబినేషన్ కాబట్టి.. సినిమాకి అది ఓ అస్సెట్ అయ్యే అవకాశం లేకపోలేదో.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు