ఇండోనేసియాలో బుధవారం ఉదయం భారీ భూకంపం
- June 07, 2016
ఇండోనేసియాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తరప్రాంతంలో మలుకు ప్రావిన్స్ లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.టెర్నటె నగరానికి వాయవ్య ప్రాంతంలో 124 కిలో మీటర్ల దూరంలో 58 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్టు సమాచారం. ఇండోనేసియా ఉత్తర ప్రాంతంలో చాలా చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కాగా సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







