బాబు పాలన బాగానే ఉంది - టీవీ 5
- June 07, 2016
చంద్రబాబు రెండేళ్ల పాలనపై టీవీ5 సర్వే నిర్వహించింది. తమ సర్వే ఫలితాలపై ఆ ఛానల్ ప్రసారం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓవరాల్ గా చంద్రబాబు పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు 43 శాతం మంది ప్రజలు బావుందని సమాధానం చెప్పడం విశేషం. చంద్రబాబు పాలన పరావాలేదని మరో 33 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24 శాతం మంది మాత్రం బాగాలేదని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి రాజధాని అమరావతి సకాలంలో నిర్మిస్తారా అన్న ప్రశ్నకు 42 శాతం మంది నిర్మిస్తారని.. మరో 26 శాతం మంది మాత్రం నిర్మించలేరని సమాధానం చెప్పారు. 32 శాతం మంది ఈ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పారట. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉందనే అంశంపై కూడా టీవీ 5 సర్వే నిర్వహించింది.బాబు పాలన బాగానే ఉంది - టీవీ 5ఇందులో చంద్రబాబు సీఎంగా బాగా కష్టపడుతున్నారని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరవాలేదని మరో 30 శాతమంది చెప్పారు. 17 శాతం మంది మాత్రం బాగా లేదని చెప్పారట. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఎలా ఉంది.. పెరిగిందా.. తగ్గిందా అన్న అంశంపై చేసిన సర్వేలో 37 శాతం మంది అవినీతి పెరిగింది అని సమాధానం చెప్పారట. మరో 42 శాతం మంది మాత్రం అవినీతి తగ్గిందని చెప్పారట.21 శాతం మంది అవినీతి విషయంలో సమాధానం తెలియదు అని చెప్పారట. మొత్తం మీద ఈ ఫలితాలు ఎక్కువ వరకూ చంద్రబాబుకు అనుకూలంగానే వచ్చినట్టు చెప్పుకోవచ్చు. బాబు పాలన బాగానే ఉందని.. కానీ ఇంకాస్త మెరుగుపడాలని జనం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అవినీతి విషయంలో మాత్రం టీడీపీ సర్కారు మేలుకొనాల్సిన సమయం వచ్చినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







