జుట్టుకు నూనె పెట్టడం మంచిదా.? కాదా.?

- April 30, 2024 , by Maagulf
జుట్టుకు నూనె పెట్టడం మంచిదా.? కాదా.?


ఇదివరకటి రోజుల్లో తలకు చక్కగా నూనె రాసి బారుగా అల్లుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, జుట్టుకు నూనె పెడితే బయటకి రావడానికే ఇబ్బంది పడుతున్నారు.

అసలు తలకు నూనె పెట్టుకోవడం మంచిదా కాదా.? తలకు నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తవు. అంతేకాదు, మాడుకు మసాజ్ చేసినట్లుగా నూనె రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్లు నుంచీ ఆరోగ్యంగా పెరుగుతుంది.

అయితే, ఇదివరకటి రోజుల్లో కాలుష్యం తక్కువగా వుండేది. సో, అప్పట్లో నూనె రాసిన జుట్టుతో బయటికి వెళ్లినా పెద్దగా సమస్యలుండేవి కావు. కానీ, ఇప్పుడలా కాదు. భయంకరమైన కాలుష్యం. నూనె రాసిన తలతో బయటికి వెళితే అనేక రకాల సమస్యల్ని(జుట్టుకు సంబంధించి) మోసుకొచ్చినట్లే అని నిపుణులు చెబుతున్నారు.

అందుకే తలకు నూనె పెట్టినప్పుడు ఇంట్లోనే వుంటే మంచిది. కొన్ని గంటల తర్వాత లైట్‌గా వున్న షాంపూతో తలస్నానం చేసి బయటికి వెళ్లడం మంచిదిని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాదు, కొబ్బరి నూనె లేదా ఆముదం, ఆలివ్ ఆయిల్‌తో హెడ్ మసాజ్ ఎప్పుడూ మంచిదే అని వారు సూచిస్తున్నారు.

అన్నట్లు కాలుష్యమే కాదు, ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com