ప్రబాస్ - హను రాఘవపూడి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారా.?

- May 06, 2024 , by Maagulf
ప్రబాస్ - హను రాఘవపూడి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారా.?

ప్రబాస్ లిస్టులో ఒక్కటి కాదు రెండు కాదు.. అరడజను వరకూ ప్రాజెక్టులున్నాయ్. ఇప్పటికే రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు ప్రబాస్. అవే ఓ వైపు ‘కల్కి’, మరోవైపు ‘రాజా సాబ్’.

ఇదే లిస్టులో వున్న మరో సినిమా హను రాఘవపూడిది. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కాన్సెప్ట్ వుండబోతోందని హను రాఘవపూడి హింట్ ఇచ్చాడు.

‘సీతారామం’ సినిమాతో తనకు కలిసొచ్చిన ఫార్ములానే ఈ సినిమాకీ ఆపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రబాస్ వంటి యూనివర్సల్ హీరోతో అంటే సబ్జెక్ట్ స్కేల్ కూడా ఆ రేంజ్‌లోనే వుంటుంది.

ఇక ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే పేరు ప్రచారంలో వుంది. తాజాగా ఈ పేరును హను రాఘవపూడి రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అంటే దాదాపు ఇదే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టబోతున్నారని అనుకోవచ్చునేమో. ‘ఫౌజీ’ అంటే సైనికుడు.

అప్పుడు ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’.. ఇప్పుడు ఓ సైనికుడి వీర ప్రేమ గాధతో రూపొందుతోన్న చిత్రమే ‘ఫౌజీ’ అన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com