‘డబుల్ ఇస్మార్ట్’కి బడ్జెట్ కష్టాలు.!
- May 14, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పూరీ జగన్నాధ్ పనైపోయిందనుకున్నవారంతా అవాక్కయ్యేలా ఈ విజయం ఆయన్ని కమ్ బ్యాక్ చేసింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ‘లైగర్’ సినిమా మళ్లీ పూరీ జగన్నాధ్‌ని పాతాళానికి పడేసిందనుకోండి. కానీ, ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ టైమ్‌లోనే అనౌన్స్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ ని మాత్రం మొదలు పెట్టాడు.
శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయ్. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి బడ్జెట్ కష్టాలు వెంటాడుతున్నాయట. బిజినెస్ అస్సలు జరగడం లేదనీ తెలుస్తోంది.
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ వున్న ప్లాఫుల పరిస్థితి కారణంగా ఈ సినిమాని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లెవరూ ముందుకు రావడం లేదట. దాంతో సినిమాని పూర్తి చేయడం కష్టంగా వుందని అంటున్నారు.
ఈ సిట్యువేషన్‌ని ఎదుర్కోవాలంటే సినిమాపై అంచనాలు క్రియేట్ చేయాలి. ఆ దిశగానే పూరీ పావులు కదుపుతున్నాడట. టీజర్‌ని ఎఫెక్టివ్‌గా కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. ఈ నెల 15న టీజర్ రిలీజ్ సన్నాహాలు జరుగుతున్నాయట.
టీజర్ ఆకట్టుకుంటే.. సినిమాకి బిజినెస్ బాగా జరుగుతుంది. చూడాలి మరి, పూరీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో.!
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!