నితిన్ సినిమాలో లయ.! రీ ఎంట్రీ అదిరిపోనుందట.!
- May 23, 2024
‘స్వయంవరం’ సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన ముద్దుగుమ్మ లయ. పదహారణాల తెలుగమ్మాయ్. అప్పట్లో కొన్ని సంచలన విజయాలే వున్నాయ్ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో.
అయితే, పెళ్లి చేసుకుని నటనకు దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నివాసముంటున్న లయ, నటనలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది.
ఆ క్రమంలోనే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. రీ ఎంట్రీలో మరిన్ని ప్రాజెక్టులు లయ కోసం చర్చల దశలో వున్నాయని తెలుస్తోంది. ఇక నుంచి వరుసగా సినిమాలు చేస్తానని లయ చెబుతోంది.
నెగిటివ్ రోల్, పవర్ ఫుల్ రోల్.. ఇలా ఎలాంటి పాత్రయినా కాస్త విభిన్న తరహా పాత్రల్లో నటించాలనుకుంటోందట లయ. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో లయ ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. అలాగే, జూనియర్ లయ (లయ ముద్దుల తనయ) కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!







