బెంగళూరులోని మూడు హోటల్స్‌కు బెదిరింపు

- May 23, 2024 , by Maagulf
బెంగళూరులోని మూడు హోటల్స్‌కు బెదిరింపు

న్యూఢిల్లీ: బెంగళూరులో మూడు ప్రముఖ హోటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్నిరోజులుగా దేశంలోని పలు ప్రాంతాలకు ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. నిన్న ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజాగా, గురువారం బెంగళూరులోని ఒట్టేరా హోటల్‌తో పాటు మరో రెండు హోటల్స్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హోటల్స్‌ను పేల్చేస్తామని ఆ మెయిల్‌లో హెచ్చరించారు.

దౌడీ జైవాల్ అనే వ్యక్తి పేరుతో ఈ మెయిల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. తాను ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకుగా చెప్పుకున్నాడు. అతను ఈ హోటల్స్ ఫ్రంట్ డెస్క్‌కు ఈ మెయిల్స్ పంపించాడు. బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదు. గతంలోను నలభై స్కూల్స్, ఆసుపత్రులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com