గోదావరి పుష్కరాలకు 'చరణ్' విమానాలు
- July 02, 2015
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... 'ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం....ఈ విమాన సంస్థ గోదావరి పుష్కరాలకు విమాన సర్వీసులు నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన శాఖ నుండి అనుమతులు రాగానే సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుపతి, బెంగుళూరు, షిర్డిలకు ఈ విమాన సర్వీలు తొలుత నడపాలని ప్లాన్ చేస్తారు. అయితే గోదావరి పుష్కరాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని మిని ఏరోప్లేన్స్ కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







