‘కల్కి’ ప్రమోషన్లు రాజశేఖర్‌కి అలా వర్కవుట్ అయ్యాయన్న మాట.!

- June 25, 2024 , by Maagulf
‘కల్కి’ ప్రమోషన్లు రాజశేఖర్‌కి అలా వర్కవుట్ అయ్యాయన్న మాట.!

ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ ట్రెండింగ్ అయిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు బర్త్‌డేల సందర్భంగా వారి వారి కెరీర్‌లలో ఫ్లాప్ సినిమాలు లేదంటే, సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా అప్పట్లో ఆయనకు బిగ్ డిజాస్టర్. కానీ, రీ రిలీజ్‌లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయర్, బాలకృష్ణ తదితర హీరోల హిట్టు సినిమాల్నీఈ మధ్య  రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమానీ రీ రిలీజ్ చేశారు. తాజాగా ప్రబాస్ ‘కల్కి’ మేనియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేనియాలో రాజశేఖర్ ‘కల్కి’ హౌస్‌ఫుల్ అవుతోందట.

అదేంటీ.! ఆ కల్కికీ, ఈ కల్కికీ సంబంధమేంటీ.? అనుకుంటున్నారా.? బుక్ మై షో యాప్‌లో ప్రబాస్ కల్కి కోసం టికెట్లు బుక్ చేసుకుంటుంటే, రాజశేఖర్ ‘కల్కి’కి బుక్ అవుతున్నాయట. అలా బుక్ మై షో మతలబుతో రాజశేఖర్ సినిమా భలే క్యాష్ చేసుకుంటోంది. ఈ రగడపై తనకెలాంటి సంబంధం లేదని తాజాగా సోషల్ మీడియాలో రాజశేఖర్ స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com