మొన్న ప్రబాస్‌కి, ఇప్పుడు మహేష్‌కి.! విశ్వరూపం చూపించబోతున్న మలయాళ స్టార్.!

- July 03, 2024 , by Maagulf
మొన్న ప్రబాస్‌కి, ఇప్పుడు మహేష్‌కి.! విశ్వరూపం చూపించబోతున్న మలయాళ స్టార్.!

ప్రబాస్ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్’ సినిమా తెలిసిందే. ఈ సినిమాలో ప్రబాస్‌కి స్నేహితుడిగా అలాగే బద్ధ శత్రువుగా రెండు డిఫరెంట్ వేరియేషన్లలో పృద్వీ రాజ్ నటించారు. మొదటి పార్ట్ ‘సలార్’లో కేవలం ప్రబాస్ స్నేహితుడిగా మాత్రమే కనిపించిన మలయాళ స్టార్ పృద్ధీ రాజ్ సుకుమారన్ రెండో పార్ట్‌లో భయంకరమైన విలన్‌గా కనిపించబోతున్నాడు.

ఆ సంగతి అటుంచితే, ఈయనకు తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ తగిలింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించబోయే ప్యాన్ వరల్డ్ మూవీ కోసం విలన్‌గా పృద్వీ రాజ్ సుకుమారన్ పేరు పరిశీలిస్తున్నారట. దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది.

ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నారు జక్కన్న. ప్రస్తుతం కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక రేపో, మాపో రాజమౌళి ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నారు.

ప్రపంచ యాత్రలు, సాహసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని గతంలోనే రాజమౌళి చెప్పేశారు. ఇక, వన్స్ ట్రాక్ ఎక్కేస్తే.. ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేస్తూనే వుంటారు రాజమౌళి. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com