కృతి శెట్టికి మరో ‘లక్కీ’ ఆఫర్.?

- July 04, 2024 , by Maagulf
కృతి శెట్టికి మరో ‘లక్కీ’ ఆఫర్.?

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టికి ఈ మధ్య ఏమంత కలిసి రావడం లేదు. అయినా అరా కొరా అవకాశాలతో నెట్టుకొచ్చేస్తూనే వుంది. కెరీర్ మొదట్లో బిజీగా సినిమాలు చేసిన కృతి శెట్టి, ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఇటీవలే ‘మనమే’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని కొత్తగా పలకరించింది.

అయితే, ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది ఈ సినిమాతో కూడా కృతి శెట్టి.  దాంతో, మళ్లీ రేస్‌లో కృతి శెట్టి వెనకబడ్డట్లే అనుకున్నారంతా. కానీ, మరో ఆఫర్ కృతి శెట్టి టాలెంట్‌ని వెతుక్కుంటూ వచ్చింది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాని మలయాళంతో పాటూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ రూపొందించబోతున్నారట. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట.

అలాగే, రానా నిర్మాణ భాగస్వామ్యం కూడా వహించబోతున్నారనీ తెలుస్తోంది. రానాతో పాటూ, దుల్కర్ సల్మాన్ కూడా నిర్మాణంలో భాగం కానున్నారట. మవుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com