సిద్దార్ధ్.! అదే తగ్గించుకుంటే మంచిది.!
- July 09, 2024
యంగ్ హీరో సిద్దార్ధ్కి టాలీవుడ్లో వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తదితర సినిమాలతో యూత్‌లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సిద్దార్ధ్.
కేవలం నటుడేు మాత్రమే కాదు సిద్దార్ధ్ మల్టీ టాలెంటెడ్. అయితే, కాస్త నోటి దురుసు ఎక్కువని చాలా మంది అంటుంటారు. ఆ నోటి దురుసుతనంతోనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటాడు.
తాజాగా ఆయన ‘ఇండియన్ 2’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అదే దురుసుతనం ప్రదర్శిస్తూ టార్గెట్ అవుతున్నాడు. లేటెస్ట్ ప్రెస్ మీట్లో భాగంగా సోషల్ అవేర్నెస్కి సంబంధించి మీడియా పర్సన్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన స్టైల్లో ఇచ్చిన సమాధానాలు వివాదాస్పదమవుతున్నాయ్.
అంతేకాదు, డ్రగ్స్ అవేర్నెస్కి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ప్రముఖ సెలబ్రిటీలకు కొన్ని సూచనలిచ్చిన సంగతి తెలిసిందే. సమాజం పట్ల బాధ్యతతో సెలబ్రిటీలు డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంచి సమాజాన్ని స్థాపించేందుకు తమదైన బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలోనూ సిద్దార్ధ్ ప్రభుత్వంపై కొన్ని పంచ్ డైలాగులు విసిరి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు. ఇలా సినిమాతో కాకుండా, సిద్దార్ధ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాడు. అదే సమయంలో టార్గెట్ కూడా అవుతున్నాడు. అందుకే కాస్త నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని ఆయన సన్నిహితులే సలహాలిస్తున్నారు సిద్దార్ధ్కి.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







