నాని ‘శనివారం’ ప్రమోషన్లు పోలా.! అదిరిపోలా.!
- July 29, 2024
‘సరిపోదా శనివారం’ అంటూ నాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు. ఆగస్టు 29న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న సినిమా ఇది.
డివివి దానయ్య, దాసరి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి పోస్టర్ నుంచీ ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తూనే వుంది. డిఫరెంట్ వేరియేషన్స్లో నాని కనిపిస్తున్నాడీ సినిమాలో.
ఈ మధ్యనే సినిమా ప్రమోషన్లు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ప్రతీ శనివారం నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఏధో ఒక అప్డేట్ వదులుతున్నారు. ఈ శనివారం అప్డేట్లో భాగంగా సినిమాలోని కీలక ప్రాతల పేర్లు పరిచయం చేస్తూ వదిలిని అప్డేట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
అలాగే వచ్చే శనివారం మరో క్రేజీ అప్డేట్ వదలబోతున్నారట. చాలా సర్ప్రైజింగ్గా వుండబోతోందటది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత శనివారం ప్రియాంక పోలీస్ డ్రస్లో వున్న పోస్టర్ రిలీజ్ చేసి, ఆమె పాత్రని రివీల్ చేశారు. ఇలా ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని అప్డేట్స్ రాబోతున్నాయో ఇంట్రెస్టింగ్గా చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







