‘విశ్వంభర’కు ఆ సినిమానే రిఫరెన్స్.! డైరెక్టర్ చెప్పేశాడు.!
- August 06, 2024
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ సెన్సేషనల్ మూవీ. అలాంటి ఆ సినిమాకి రిఫరెన్స్‌గా తీసుకునే ఇప్పుడు వశిష్ట ‘విశ్వంభర’ను తెరకెక్కిస్తున్నాడట.
డైరెక్ట్‌గా ఈ విషయాన్ని ఆయనే తన మాటల్లో చెప్పడం విశేషం, తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘విశ్వంభర’ లోని గ్రాఫిక్స్, విజువల్స్, లొకేషన్స్ మహాద్భుతంగా వుంటాయనీ, అలనాటి మెగాస్టార్ సెన్సేషనల్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గుర్తొస్తుందని.. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆ స్థాయిలో గుర్తుంచుకుంటారనీ ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
అంతేకాదు, క్లైమాక్స్ లోని సన్నివేశాలూ, ఆయా సన్నివేశాల కోసం వాడే గ్రాఫిక్స్ మరింత హైలైట్‌గా వుంటాయనీ మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మధ్య ఓ సందర్భంలో తెలపడం విశేషం. దాంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. అవి మరింత పెరిగిపోయాయ్.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే సన్నాహాల్లో వున్నారు. త్రిషతో పాటూ ఆషికా రంగనాధ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







