నాన్‌స్టిక్ పాత్రల్లో వండిన వంటకాలు తింటే అంతే సంగతి.!
- August 06, 2024
ఒకప్పుడు మట్టి కుండల్లో వండిన వంటకాలు తినేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు వచ్చి చేరాయ్. ఆధునిక ప్రపంచంలో నాన్ స్టిక్ పాత్రలు వాటి స్థానాన్ని ఆక్యుపై చేసేశాయ్.
నాన్ స్టిక్ కుకింగ్ వేర్ వంట గదిని చూసేందుకు అందంగా వుంచుతాయన్న అభిప్రాయాలు. అలాగే, ప్రెస్టీజ్ ఇష్యూ కూడా వచ్చేసింది. నాన్ స్టిక్ పాన్స్ వాడకపోవడం అదేదో చిన్నతనంగా ఫీలవుతున్నారు కొందరు నయా ట్రెండింగ్‌లో.
చిన్నతనం మాట దేవుడెరుగు. ఈ నాన్ స్టిక్ పాత్రల్లో వండిన వంటకాలు తింటే త్వరగా పైకి పోతారట. అదేనండీ ప్రాణాపాయ పరిస్థితులు చాలా ఎక్కువ. నాన్ స్టిక్ పాత్రల్లో వాడే టెఫ్లాన్ 500 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద విషపూరిత రసాయనాల్ని వెదజల్లుతోందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
తద్వారా వీటిలో వండిన వంటకాలు తినడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ అనే కొత్త వ్యాధులొస్తున్నాయట. అలాగే, అనేక రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా సంక్రమిస్తున్నానీ, క్యాన్సర్ ముప్పు తప్పదనీ హెచ్చరిస్తున్నారు.
అమెరికా వంటి విదేశాల్లో ఇప్పటికే ఈ నాన్ స్టిక్ పాత్రల్ని బ్యాన్ చేశారు కొన్ని ప్రదేశాల్లో. రెగ్యులర్‌గా నాన్‌స్టిక్ పాత్రల్ని ఓవర్ హీట్ చేయడం వల్ల అందలోంచి తొమ్మిది వేల కెమికల్ పార్టికల్స్ ఆహారంలో కలుస్తాయట. తద్వారా అవి మన శరీరంలోకి చేరి దారుణంగా హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సో ఓల్డ్ ఈజ్ గుడ్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరీ మట్టి కుండలు కాకపోయినా.. కనీసం అల్యూమినియం పాత్రల్లో వండుకోవడమైనా ఉత్తమం. ట్రెండ్ పేరు చెప్పి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు సుమా.! తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







