రవితేజ పోలవరపుకు బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డు

- August 06, 2024 , by Maagulf
రవితేజ పోలవరపుకు బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డు

దుబాయ్: ఇండియన్స్‌ చాలా మంది అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచంలోని నలుమూలలా భారతీయుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌ వేర్‌, బిజినెస్‌ ఇలా ఏదైనా.. సరే ప్రపంచంలోని నలుమూలలా ఇండియన్స్‌ ముద్ర ఉంటుంది. అయితే.. అచ్చం అలాగే... ఇండియాకు చెందిన రవితేజ పోలవరపు.. పిన్న వయస్సులోనే ఉన్నత శిఖరాలకు ఎదిగారు. 32 సంవత్సరాల వయస్సులో, ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ (EIC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విశేషమైన నాయకత్వాన్ని మరియు ఆవిష్కరణను ప్రదర్శించారు రవితేజ పోలవరపు.  ఆయన నాయకత్వం, దూర దృష్టి, ఆవిష్కరణలకు గానూ.. గల్ఫ్ బిజినెస్ అవార్డ్స్‌లో ఎమర్జింగ్ CEO ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం  చేసుకున్నారు రవితేజ పోలవరపు. 

ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ (EIC) లో రవి చేసిన కృషి అంతా ఇంతా కాదు. రవి నాయకత్వంలో, EIC క్లయింట్‌లకు స్థిరమైన అభ్యాసాలపై సలహా ఇవ్వడమే కాకుండా, ఈ సూత్రాలను కంపెనీ కార్యకలాపాలలో పొందుపరిచి, పరిశ్రమ బెంచ్‌మార్క్‌ను పెంచడం జరిగింది. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ (EIC) ని ఒకే కార్యాలయం నుంచి నాలుగు స్థానాలకు విస్తరించడంలో రవి కృష్టి చాలా గొప్పది. సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కృష్టి చేస్తున్నారు. 

తన టీంలో మొదట ముగ్గురు ఉద్యోగులు ఉంటే.. దాన్ని డెవలప్ చేసి...20 మంది ఉద్యోగులకు పెంచుకున్నారు. అలాగే కంపెనీలో క్లైయింట్లను కూడా 150% పెంచుకున్నారు. అంతేకాదు..రవితేజ పోలవరపు..  మార్గదర్శకత్వంలో కంపెనీ ఆదాయం మూడు రెట్లు పెరిగడం జరిగింది. ఇదే పంథాలో వెళితే..రవితేజ పోలవరపు..నాయకత్వంలో కంపెనీ మరింత ఆర్ధికంగా పుంజుకుంటుంది.

రవితేజ పోలవరపు యొక్క విద్యార్హతల విషయాలు పరిశీలిస్తే... అతను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నుండి స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించాడు. అంతేకాదు.... M. S. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కలిగి ఉన్నాడు రవితేజ పోలవరపు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com