ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి
- August 06, 2024
ఫిజీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఫిజీ దేశంలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ముకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ ప్రదానం చేసింది. ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరే ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారంతో భారత రాష్ట్రపతిని గౌరవించారు. దీనిపట్ల ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ముర్ము ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఫిజీని దృఢమైన, స్థితిస్థాపక, సుసంపన్న దేశంగా మలిచే దిశగా భారత్ భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని ముర్ము స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి