అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్..

- August 06, 2024 , by Maagulf
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్..

కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రారంభమైంది. భారత మార్కెట్లో వినియోగదారులందరికీ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల నుంచి భారీ అప్లియన్సెస్, వ్యక్తిగత గాడ్జెట్‌ల వరకు అనేక రకాల వస్తువులపై భారీ తగ్గింపు ధరలకు అందిస్తోంది.

ఈ సేల్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన కేటగిరీలో స్మార్ట్‌ఫోన్‌లు. Apple, Samsung, OnePlus, Motorola మరిన్ని ప్రముఖ బ్రాండ్‌ల నుంచి హ్యాండ్‌సెట్‌లను అమెజాన్ సేల్ సమయంలో తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ముఖ్యంగా, క్రెడిట్ కార్డ్‌లు లేదా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్‌లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే యూపీఐని ఉపయోగించే కొనుగోలుదారులు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లకు అర్హులు. అదనపు కూపన్ డిస్కౌంట్లతో పాటు తగ్గింపు ధరల కన్నా హ్యాండ్‌సెట్‌ల ధరలపై మరింత తగ్గింపు పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి.

ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ 256జీబీ వెర్షన్‌ను తక్కువ ధర రూ. 47,900కు సేల్ సమయంలో సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 79,900 నుంచి గణనీయంగా తగ్గింది. టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ వంటి ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ దేశంలో రూ. రూ. 88,888లకు లాంచ్ కాగా, ఆఫర్ ద్వారా కేవలం రూ. 53,999కు అందుబాటులో ఉంది. రియల్‌మి నార్జో ఎన్61 వంటి బడ్జెట్ ఫోన్‌లను కూడా 6జీబీ + 128జీబీ ఆప్షన్ రూ. 8,499 బదులుగా సాధారణ ధర రూ. 6,999కు పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com