ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- August 17, 2024
హైదరాబాద్: కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ " ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది.యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది . ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి " అన్నారు
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ " నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కారాయించామన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ " ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు "
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







