సౌదీ నాన్ ప్రాఫిట్ సెక్టర్.. ప్రవాస ఫీ, కస్టమ్స్ డ్యూటీ మినిహాయింపు..!

- August 25, 2024 , by Maagulf
సౌదీ నాన్ ప్రాఫిట్ సెక్టర్.. ప్రవాస ఫీ, కస్టమ్స్ డ్యూటీ మినిహాయింపు..!

రియాద్: లాభాపేక్ష లేని సెక్టార్‌లో పనిచేస్తున్న అసోసియేషన్‌లు,  సొసైటీలకు లేబర్ ఫీజు, ఎక్స్‌పాట్ ఫీజు, జకాత్ మరియు కస్టమ్స్ డ్యూటీల మినహాయింపుతో సహా అనేక ప్రోత్సాహకాలను సౌదీ అరేబియా అందించనుంది. ఈ విషయాన్ని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రి అహ్మద్ అల్-రాజీ ప్రకటించారు. "ప్రస్తుతం మంత్రివర్గ కమిటీ లాభాపేక్షలేని రంగాన్ని అభివృద్ధి చేయడానికి 21 ప్రోత్సాహకాల జాబితాను అధ్యయనం చేస్తోంది. మరియు ఈ రంగానికి కార్మిక రుసుములు, ఆర్థిక రుసుములు, జకాత్ మరియు కస్టమ్స్ సుంకాలు మినహాయింపు ఇవ్వడం వంటివి ఉన్నాయి." అని ఆయన అన్నారు.  ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రివర్గ కమిటీ అధ్యయనం చేస్తోందని, అక్టోబర్ 2024 చివరి నాటికి దాని సిఫార్సులను సమర్పించాలని గడువు విధించినట్లు తెలిపారు. సౌదీలో లాభాపేక్షలేని రంగం 181 శాతం వృద్ధి రేటును సాధించిందని, ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య 5,000కు చేరుకుందని, వీటిలో 4,000 సొసైటీలు, 400 ప్రైవేట్ సంస్థలు మరియు 530 కుటుంబ నిధులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. GDPకి లాభాపేక్షలేని రంగం 0.87 శాతానికి చేరుకుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com