డ్రోన్ యూనిట్లను పెంచనున్న దుబాయ్ పోలీసులు.. గోప్యతపై క్లారిటీ..!!

- September 19, 2024 , by Maagulf
డ్రోన్ యూనిట్లను పెంచనున్న దుబాయ్ పోలీసులు.. గోప్యతపై క్లారిటీ..!!

యూఏఈ: దుబాయ్ పోలీసులు తమ ఫ్లాగ్‌షిప్ డ్రోన్ వినియోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి ఆరు నుండి ఎనిమిది యూనిట్లకు పెంచాలని యోచిస్తున్నారు.   ఈ అధునాతన వ్యవస్థ, పోలీసింగ్ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్నారు. అత్యవసర ప్రతిస్పందన సమయాలను మెరుగుపరచడం,  ఎమిరేట్ అంతటా ప్రజల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.   2021లో యూఏఈ  వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తొలిసారిగా డ్రోన్ బాక్స్ సిస్టమ్‌ను పరిచయం చేశారు.  జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌లోని మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ సెంటర్ హెడ్ కెప్టెన్ మొహమ్మద్ ఒమర్ అల్ముహైరి ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ..  “డ్రోన్ బాక్స్ సిస్టమ్ అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడంలో నిర్ణయాత్మక ప్రక్రియలకు అవసరమైన డేటా మద్దతును అందించడంలో కీలకమైనది. కనీస మానవ జోక్యంతో దుబాయ్ అంతటా సమగ్ర కవరేజీని కలిగి ఉండటమే మా లక్ష్యం. ’’ అని పేర్కొన్నారు.

మెరుగైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే వ్యూహాంలో భాగంగా అధునాతన డ్రోన్ వ్యవస్థను మోహరించిన మొదటి గ్లోబల్ ఏజెన్సీలలో దుబాయ్ పోలీస్ కూడా ఒకటి. డ్రోన్లు ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర ప్రతిస్పందన, సంక్షోభ నిర్వహణతో సహా అనేక రకాల కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో డ్రోన్ బాక్స్ వ్యవస్థ గురించి ప్రజలలో ఉన్న అపోహలను కెప్టెన్ మహ్మద్ ఒమర్ అల్ముహైరి కొట్టిపారేశారు.  ప్రజల గోప్యతకు సంబంధించిన ఆందోళనలు అనవసరమని తెలిపారు.  ముఖ్యంగా నివాస ప్రాంతాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com